Kadapa:ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు.

Rathnakar Darshanala
Kadapa:ఇడుపులపాయలో  వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు.
కడప/ఇడుపులపాయ సెప్టెంబర్ 2,(నేటి వార్త )

మాజీ ముఖ్య మంత్రి, దివంగత నేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నిర్వహించిన వర్ధంతి కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు  వై.ఎస్. షర్మిలా రెడ్డితో కలిసి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు రాలు  ఎన్.డి. విజయ జ్యోతి పాల్గొని వైఎస్సా ర్‌కు ఘనంగా నివాళులర్పిం చారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనా కార్య క్రమం నిర్వహించి, ఆయనసమా ధి వద్ద పుష్పాంజలి ఘటించా రు.

 వైఎస్సార్ ప్రజలకు అందిం చిన సేవలను, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, మైనా ర్టీలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్ర మాలను కాంగ్రెస్ నాయకులు ఈ సంద ర్భంగా స్మరించుకున్నారు.

వైఎస్సార్ ఆశయాలు, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యో తి పేర్కొన్నారు.

 ప్రజల హృ దయాల్లో వైఎస్సార్ చిరస్థాయి గా నిలిచిపోయారని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో కడప, పులివెందుల, ప్రొద్దు టూరు, కమలాపురం నియో జకవర్గాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్లు బండి జకరయ్య, ధ్రువ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్, అశోక్ కుమార్ రెడ్డి, 

పీసీసీ ప్రధాన కార్యదర్శి అలీ ఖాన్, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమాల్ భాష, కేకేసీ జిల్లా చైర్మన్ దాసరి శ్రీనివాసులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్, 

కేకేసీ నగర చైర్మన్ షామీర్ హుస్సేన్, . మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుభాన్ బీ, మహిళా ఉపాధ్య క్షురాలు విజయ,యూత్  కాంగ్రె స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు లు వెంకటసుబ్బయ్య,

 మైనార్టీ జిల్లా అధ్యక్షులు రహమతుల్లా ఖాన్, షబానా రఫీఖ్ ఖాన్ (ఎన్‌ఆర్‌ఐ), వేముల మండల అధ్యక్షులు వెంకటేష్, హమీద్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.
Comments