ఈతకు వెళ్లి బావిలో మునిగి బాలుడు మృతి.

Rathnakar Darshanala
ఈతకు వెళ్లి బావిలో మునిగి బాలుడు మృతి.
 

నేటి వార్త ఏప్రిల్ 26 గొల్లపల్లి :

 ఓ బాలుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు . ఈ ఘటన   జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని  లోత్తునూరు గ్రామంలో చోటు చేసుకుంది.

పోలీసుల సమాచారం మేరకు గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు  బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెల్లి రితేష్ (13) అనే బాలుడు  హాజరయ్యాడు .

వివాహనంతరం మధ్యాహ్నం సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో గల వ్యవసాయ బావిలోకి ఈతకని దిగాడు .

ఈత రాకపోవడంతో రితేష్   ప్రమాదవశాత్తు నీటిలో  మునిగి మృతి చెందాడు .బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు .

ఈ విషయమై బాలుడి తల్లి కాంపల్లి మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 .ప్రజలు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా అనుభవం లేని వారు బావులు ,చెరువులు వంటి నీటి వనరుల్లో ఈత కొట్టకుండా ఉండాలని పోలీసులు సూచించారు .
Comments