Jagityala :నీట్ లో మెరిసిన మొగిలిపెట్ గ్రామం విద్యార్థి.

Rathnakar Darshanala
నీట్ లో మెరిసిన మొగిలిపెట్ గ్రామం విద్యార్థి.
మల్లాపూర్ అక్టోబర్ 30 (నేటి వార్త దిన పత్రిక)

మల్లాపూర్ మండలం మొగిలిపెట్ గ్రామానికి చెందిన మోత్కూరి మురళి గౌడ్ ఆర్ఎంపి కుమారుడు హర్షిత్ తేజ్ ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి నిర్మల్ వైద్య కళాశాలలో కన్వీనర్ కోటాలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది. 

హర్షతేజ్ మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా చదివితే ఏమైనా సాధించొచ్చు అని తెలుపుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే నా లక్ష్యం అని తెలియజేశారు.

ఇట్టి కార్యక్రమం లో గ్రామ ప్రజలు వివిధ నాయకులు మోత్కూరి హర్షతేజ్ ను అభినందించారు.
Comments