కంభం సమీపంలో హిట్ అండ్ రన్.. గుర్తు తెలియని వ్యక్తి మృతి.
By
Rathnakar Darshanala
కంభం సమీపంలో హిట్ అండ్ రన్.. గుర్తు తెలియని వ్యక్తి మృతి.
నేటివార్త,కంభం, సెప్టెంబర్ 2
కంభం పట్టణ సమీపంలోని ఎస్‌వీకేపీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద తెల్లవారుజామున హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో కంభం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదం సుమారు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 4:30 గంటల మధ్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు వివరాలు లభించకపోవడంతో ప్రస్తుతం అతని గుర్తింపు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా అతని గురించి సమాచారం తెలిసిన వారు కంభం పోలీసులను సంప్రదించాలని కోరారు.
ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు.
Comments