6న చలో ఖానాపూర్.
By
Rathnakar Darshanala
6న చలో ఖానాపూర్.
నేటివార్త, నిర్మల్,సెప్టెంబర్ 02: నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో దళిత కుటుంబం ఇంటిని కూల్చివేసిన వీడీసీ నాయకుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 6న చలో ఖానాపూర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దళిత బహుజన ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.
ఖానాపూర్ లోని ఏఎంకే ఫంక్షన్ హాల్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని జేసీబీ, ట్రాక్టర్లు, కారును సీజ్ చేయాలి.
బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి.వీడీసీ దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు.
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాజేష్ రక్షక్ - అంబేద్కర్ సంఘం బాసర జోన్ ఇంచార్జ్, కుంటోల్ల వెంకటస్వామి - అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాసమల్ల అశోక్ - నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు, కాంబ్లే సూర్యకాంత్ - భీమ్ ఆర్మీ బ్లూ పాంథర్ రాష్ట్ర అధ్యక్షులు, కొంతం గణేష్ - మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు, బొమ్మెన రాకేష్ - అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Comments