ప్రతి కుటుంబానికి అండగా ఎన్టీఆర్ భరోసా:

Rathnakar Darshanala
ప్రతి కుటుంబానికి అండగా ఎన్టీఆర్ భరోసా: 
సుగవాసి ప్రసాద్ బాబు, శంకర్ యాదవ్

తంబళ్లపల్లె సెప్టెంబర్ 01: (నేటి వార్త) నియోజకవర్గంలోని బి కొత్తకోట మండలం గట్టు గ్రామ పంచా యతీలో “ఎన్టీఆర్ భరో సా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగ ళవారం పండుగ వాతావ రణం లో ఘనంగా జరిగింది.

ఈ కార్య క్రమంలో రాజంపేట పార్ల మెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ మాజీ సభ్యులు  సుగవాసి ప్రసా ద్ బాబు  తంబళ్లపల్లె నియో జకవ ర్గ టీడీపీ ఇంచార్జి శంకర్ యాదవ్ పాల్గొని, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్ష న్లను నేరుగా అందజేశారు.

పెన్షన్ అందుకున్న అవ్వాతాత లు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. 

తమ ఇంటి ముంగిటకే ప్రభుత్వం పెన్షన్ అందించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్య మంత్రి  నారా చంద్రబాబు నా యుడుకు , కూటమి ప్రభు త్వానికి కృతజ్ఞతలు తెలిపా రు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ ముఖ్య నాయకులు, మండల నాయ కులు, కార్యకర్తలు, అభిమా నులు, గ్రామ పెద్దలు, మహిళలు  పెన్షన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
Comments