5 న ఖమ్మంలో వికలాంగుల జాతీయ కార్యవర్గ సమావేశం :
By
Rathnakar Darshanala
5 న ఖమ్మంలో వికలాంగుల జాతీయ కార్యవర్గ సమావేశం :
రాష్ట్ర అధ్యక్షుడు చిన్న సుబ్బ య్య.
కడప అర్బన్ సెప్టెంబర్ 01: (నేటి వార్త ) ఈనెల 5 వ తేదీన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా లో జాతీయ కార్యవర్గ సమావేశం జరుగు తుందని జిల్లాలోని వికలాంగు లందరూ పాల్గొని జయప్రదం చేయాలని సమితి రాష్ట్ర అధ్య క్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ కోరారు.
కడప ప్రెస్ క్లబ్ లో ఆయన విలేక రులతో మాట్లాడారు. ఈ సమా వేశానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజ రవుతారని చెప్పారు.వికలాం గుల సమస్య లు,పోరాటాలపై దిశానిర్ధేశం తెలియజేస్తారని అన్నారు.
వికలాంగులకు జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి అందించాలని, స్థానిక ఎన్నికల్లో సీఎం ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ప్రకటించిన విధంగా కార్పొరే షన్లు, జడ్పీటీ సీలు, పంచాయ తీల్లో నాలుగు శాతం పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
బ్లాక్ లాక్ ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వా లని, బ్యాంకు రుణాలు వెంటనే మంజూరు చేయాలని కోరా రు.ప్రతి మండలంలో ఇంటి స్థలాలు కేటాయించి భవనాలను నిర్మించాలని చెప్పారు.
గత ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా తాత్కా లికంగా ఉద్యోగం చేస్తున్న 95,000 మందికి పింఛన్ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.వారికి వెంటనే ఫించన్లు మంజూరు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సమితి మహిళా అధ్యక్షురాలు ఈశ్వర మ్మ నగర అధ్యక్షుడు ప్రసాద్ మైదుకూరు నియోజకవర్గ ఇన్చా ర్జి ఓబయ్య రాజయ్య చిన్న బాబు తదురులు పాల్గొన్నారు
Comments