నిర్మల్ లో కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాటు.
By
Rathnakar Darshanala
నిర్మల్ లో కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాటు.
పోరుబాట విజయవంతం చేయాలని పిలుపు
నేటివార్త, సెప్టెంబర్ 01:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న,
కాంగ్రెస్ 420 మోసాలపై పోరుబాట కార్యక్రమాన్ని నిర్మల్ కేంద్రంలోని మంగళవారం తన నివాసంలో ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు గడుస్తున్నా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మిన ప్రజలను నిట్టనిలువునా దగా చేసిందని ఆయన మండిపడ్డారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేలు, వికలాంగులకు నెలకు రూ.6 వేలు, ఎకరాకు రూ.15 వేల రైతుబంధు,
విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, కౌలు రైతులు ఒక్కటి కూడా అమలు కాలేదని ఆయన విమర్శించారు. యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు, ఎన్నికల హామీల అమలులో జరుగుతున్న మోసం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజానీకానికి చేరవేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 2నుంచి 8వరకు నియోజకవర్గంలో చేపట్టే నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈకార్యక్రమంలో భాగంగా రేపు మొదటిగా ఆర్డీవో ఆఫీస్ లో వినతి ఇవ్వడం జరుగుతుంది 2 రోజు రేవంత్ పాలనపై మహిళా పింఛన్ రైతు రుణమాఫీ రైతుబంధు గురించి వివరణ చేయడం జరుగుతుంది,
3మూడవరోజు రైతు సదస్సు కార్యక్రమం ఉంటుంది 4నాలుగవ రోజు రెండువేల పించం 4000 వరకు చేస్తామని హామీ ఇచ్చిన కే రేవంత్ ప్రభుత్వం పై తీవ్ర పరిణామం చేకూర్స్తోమని హామీ ఇచ్చారు,5th రోజు ఉదయం 10గంటలకు కొండాపూర్ పార్టీ ఆఫీస్ లో
ధర్నా బాకీ కార్డులు పంచడం ప్లెక్సీ ప్రదర్శన కార్యక్రమానికి పార్టీ నాయకులు, 6 ఆరవ రోజు ట్యాంక్ బండి పై అంబేద్కర్ గారికి మెమోడరం ఇవ్వడం జరుగుతుంది 7 రోజు మండల ఆఫీసులో వినతులు, 8రోజు ముగింపు కార్యక్రమం ,
వినతులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాటను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో నిర్మల్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాంకిషన్ రెడ్డి, సోన్ ఎక్స్ జెడ్పిటిసి జీవన్ రెడ్డి,కన్వీనర్ సాయి రెడ్డి, నిర్మల్ కన్వీనర్ మహేష్ రెడ్డి,లక్ష్మణ్ చంద్ర కన్వీనర్ కృష్ణారెడ్డి, దిలాపూర్ కన్వీనర్ చిన్నారెడ్డి, సారంగాపూర్ కన్వీనర్ దేవి శంకర్ శ్యామ్ రెడ్డి , దత్తు , అన్వేష్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు
Comments