మానసిక వేదనతో ..మామిడి తోటలో ఉరి.
By
Rathnakar Darshanala
ప్రమాదం తర్వాత మానసిక వేదన..మామిడి తోటలో ఉరి.
నేటివార్త రాయికల్, సెప్టెంబరు 1:
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంతో అనారోగ్యానికి గురై మానసిక వేదనకు లోనైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన రాయికల్ శివారులో మంగళవారం చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. రాయికల్‌కు చెందిన కొందాడి శ్రీనివాసరావు (51) కొద్దిరోజుల క్రితం మేడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.
అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మానసికంగా ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. జీవితంపై విరక్తి చెంది రాయికల్ శివారులోని సిరికొండ రాజిరెడ్డి మామిడి తోటలో మామిడి చెట్టుకు తాడుతో ఉరేసుకుని మృతిచెందాడు.
మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో మృతుడి భార్య కొందాడి కవిత (45) రాయికల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
Comments