కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట.

Rathnakar Darshanala
కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట.
ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య సమావేశం.

పోరుబాట విజయవంతం చేయాలని పిలుపు.

తాండూర్, నేటివార్త, సెప్టెంబర్ 01: 
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకు,

బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న, కాంగ్రెస్ 420 మోసాలపై పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. 

తాండూర్ మండల కేంద్రంలోని ఎలుక రాంచందర్ నివాసంలో మంగళవారం ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు గడుస్తున్నా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీని నమ్మిన ప్రజలను నిట్టనిలువునా దగా చేసిందని ఆయన మండిపడ్డారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేలు, వికలాంగులకు నెలకు రూ.6 వేలు, ఎకరాకు రూ.15 వేల రైతుబంధు, 

విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, కౌలు రైతులకు రూ.12 వేలు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు తదితర కాంగ్రెస్ 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని ఆయన విమర్శించారు. 

యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు, ఎన్నికల హామీల అమలులో జరుగుతున్న మోసం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజానీకానికి చేరవేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. 

పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాటను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి పురుషోత్తం గౌడ్, మంగపతి సురేష్ బాబు, పూసల ప్రణయ్ కుమార్, బోనగిరి చంద్రశేఖర్, మాసాడి శ్రీరాములు, గట్టు సంతోష్, బోడ సతీష్, మొగిలి శంకర్, జాడి పోశం,  అర్జున్, పెరిక రాజన్న, బాబు ఖాన్, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Comments