వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం జిల్లా అభివృద్ధికి కొత్త ఊపిరి.
By
Rathnakar Darshanala
వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం జిల్లా అభివృద్ధికి కొత్త ఊపిరి.
నేటివార్త,మార్కాపురం, సెప్టెంబర్ 1:
వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమం విజయవంతంగా జరిగిందని మార్కాపురం జిల్లా కలెక్టర్ సునీత తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక కార్యక్రమాలు నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.
వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. రూ.150 కోట్లకు సంబంధించిన OTS, 1998 మేజర్ అండ్ సన్ కుటుంబాలకు అదనపు సంక్షేమ ప్రయోజనాలు అందించే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ముంపు గ్రామాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పశువులకు పశుగ్రాసం, నిత్యావసర సరుకులు అందించడంతో పాటు సుమారు 6 వేల కుటుంబాలకు గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
గృహ ప్రవేశం సందర్భంగా పసుపు, కుంకుమ అందించనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా పునరావాసం, పునరావాస పరిహారానికి సంబంధించి రూ.170 కోట్లతో జీవో విడుదల చేసినట్లు కలెక్టర్ సునీత తెలిపారు.
R&R, OTS పరిధిలో అర్హులైన వారికి పట్టాలు మంజూరు చేస్తున్నామని, ఇంకా పట్టాలు తీసుకోని లబ్ధిదారులను అధికారులు గుర్తించి వారి వద్దకు వెళ్లి పట్టాలు అందించాలని సూచించారు.
వెలుగొండ ప్రాజెక్టు కారణంగా ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments