రైతులకు యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలి.
By
Rathnakar Darshanala
రైతులకు యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలి.
తాండూర్, నేటివార్త, జూన్ 08:
రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను ఆన్‌లైన్ ద్వారా సరఫరా చేసే విధానాన్ని అమలు చేస్తోందని, మంచిర్యాల డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టు మురళీధర్ రావు అన్నారు.
సోమవారం తాండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, దళారుల బెడద లేకుండా, పారదర్శకంగా రైతులకు నేరుగా యూరియా అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే తాండూర్ మండలానికి ఐదు మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం వెంటనే సరఫరా చేసిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. గతంలో ఎరువుల కోసం రైతులు రాత్రంతా క్యూలైన్లలో నిలబడేవారు.
ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించిందని, రైతులు తమ మొబైల్ ద్వారా బుక్ చేసుకొని నేరుగా యూరియా పొందవచ్చని వివరించారు.
అయితే కొందరు ఫెర్టిలైజర్ షాపు యజమానులు, డీలర్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
రైతు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాన్ని దుర్వినియోగం చేయవద్దని, ఫెర్టిలైజర్ షాపు యజమానులు నిబంధనల ప్రకారమే యూరియాను విక్రయించాలని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కటికల మల్లేష్, చీకటి వేంకటేశం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Comments