కారు ద్విచక్రవాహనం ఢీకొని ఎస్ఐ మృతి.
By
Rathnakar Darshanala
కారు ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు దుర్మారణం.
*ఒకరు మహిళ ఎస్ఐ మరొకరు బ్యాంకు ఉద్యోగి*
*ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్*
నేటివార్త జగిత్యాల బ్యూరో ఫిబ్రవరి 04 :
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డీసీఆర్‌బీ ఎస్‌ఐ శ్వేత మరియు ద్విచక్రవాహనం పై వెళ్తున్న మల్యాల మండలం ముత్యంపేట గ్రామన్నికి చెందిన బ్యాంకు ఉద్యోగి నరేష్ అక్కడిక్కడే మృతి చెందారు.
టీఏస్21జి 4172 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై బ్యాంకు ఉద్యోగి నరేష్ విధులు నిమిత్తం మంచిర్యాల జిల్లా లక్షిట్ పేట్ వెళ్తున్నాడు.
ధర్మారం మండలం అర్నకొండ నుండి జగిత్యాలకు విధులు నిర్వహించటానికి మహిళ ఎస్‌ఐ శ్వేత కారులో బయలుదేరారు.
గొల్లపెల్లి మండలం చిల్వకోడూరు వద్ద కారు ద్విచక్రవాహనం ఢీకొని కారులో ప్రయానిస్తున్న ఎస్ఐ శ్వేత ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న బ్యాంకు ఉద్యోగి నరేష్ ఇద్దరూ మృతి చెందారు.
కారు అతివేగమే ఈ ప్రమాదం గల కారణమని తెలుస్తుంది.ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు రోడ్డు కిందికి దిగి చెట్టును ఢీ కొట్టింది.ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ పరిశీలించారు.
ఆనంతరం జిల్లా ఆస్పత్రికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎస్‌ఐ శ్వేత గతంలో కోరుట్ల వెల్గటూరు కథలాపూర్ పెగడపల్లి ప్రాంతాలలో ఎస్‌ఐగా పనిచేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments