నకిలీ పత్తి విత్తనాల విక్రేతపై పీడీ చట్టం అమలు.
By
Rathnakar Darshanala
నకిలీ పత్తి విత్తనాల విక్రేతపై పీడీ చట్టం అమలు.
తాండూర్, నేటివార్త, జూన్ 17 :
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిపై రామగుండం పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు.
మంచిర్యాల జిల్లా తాండూర్, భీమారం ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ఏపీకి చెందిన వూస సుబ్బారావును బుధవారం చర్లపల్లి జైలుకు తరలించినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సుబ్బారావు తాండూర్, భీమిని, భీమారం, బెల్లంపల్లి, నెన్నెల, చెన్నూర్ మండలాల్లో ఏజెంట్ల ద్వారా నకిలీ విత్తనాలు అమ్ముతున్నాడు.
ఈ ఏడాదిలోనే ఇతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. 2021 నుంచి 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2021లోనే పీడీ చట్టం అమలు చేసినా వైఖరి మార్చుకోలేదని సీపీ తెలిపారు.
ఏపీ నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి అసలు విత్తనాలుగా నమ్మించి రైతులను మోసం చేస్తున్నాడని, నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
తాండూర్ సీఐ దేవయ్య, ఎస్‌ఐ ప్రసాద్ నిందితుడిని జైలుకు తరలించారు.
Comments