తమ్ముడు మృతితో విషాదంలో ఉన్న సట్టి సాయన్నకు పరామర్శ.

Rathnakar Darshanala
తమ్ముడు మృతితో విషాదంలో ఉన్న సట్టి సాయన్నకు పరామర్శ.
నేటి వార్త నిర్మల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మే 30: 

దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సట్టి సాయన్న తమ్ముడు రాజన్న ఈ నెల 26న ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకె ప్రభాకర్, 
నేటివార్త స్టాఫ్ రిపోర్టర్ రాజు,

ఎంహెచ్‌పీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కత్తి విష్ణు, దరువు భోజన్న దుందాం కళాకారుడు శనివారం నిర్మల్ పట్టణంలోని గాజులపేటలో ఉన్న సట్టి సాయన్న నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా రాజన్న మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన వారు, సట్టి సాయన్నతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి తమ సానుభూతిని తెలియజేశారు.

రాజన్న ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
Comments