దుకాణాలలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు.
By
Rathnakar Darshanala
దుకాణాలలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు.
నేటివార్త ప్రతినిధి ఇల్లంతకుంట మే 30 :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో పలు కిరాణా షాపులు,పాన్ షాప్ లలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై సిరిసిల్ల అశోక్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గితే ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించామని కిరాణా షాపులు,పాన్ షాప్ లలో గంజాయి,ఇతర మత్తు పదార్ధాలు అమ్మడం నేరమని తెలిపారు.
అలాగే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Comments