పట్టణ పరిశుభ్రత తో పాటు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కూడా తమ బాధ్యత.మున్సిపల్ చైర్మన్.
By
Rathnakar Darshanala
పట్టణ పరిశుభ్రత తో పాటు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కూడా తమ బాధ్యత.మున్సిపల్ చైర్మన్.
నేటి వార్త ఆదిలాబాద్ :
నిరంతరం ఆదిలాబాద్ పట్టణ పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కూడా తమ బాధ్యత అని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష అన్నారు.
మే డే ను పురస్కరించుకొని శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ సొంత నిధులతో కొనుగోలు చేసిన సబ్బులు, నూనె, బెల్లం ,చెప్పులు ,గ్లౌస్లు తదితర వాటిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి పాశుద్ధ కార్మికులకు అందించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ మే డే అంటే కార్మికులకు సెలవు కాదని వారి సంక్షేమం కూడా అంతే ముఖ్యమన్నారు.
పట్టణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కార్మికులు కూడా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా తమ వంతు బాధ్యత వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ నూతన కమిషనర్ జగదీష్ గౌడ్, సానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ , మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments