ADB బేలా :రైతులు పండించిన ప్రతి గింజను కొనే వరకు పోరాడుతాం.

Rathnakar Darshanala
రైతులు పండించిన ప్రతి గింజను కొనే వరకు పోరాడుతాం.
మాజీ మంత్రి జోగు రామన్న....

నేటి వార్త బేలా :

 దేశానికి వెన్నెముక అయిన రైతులు వారు పండించే ప్రతి గింజను ప్రభుత్వాలు కొనేవరకు బిఆర్ఎస్ పార్టీ పోరాడుతునే ఉంటుందని మాజీ మంత్రి జోగు రామన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

శనగలతో పాటు జొన్నలను  ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జైనథ్,బేల మండలాలలో జాతీయ రహదారులను శనివారం రైతులు దిగ్బందించగా రైతుల పక్షాన బిఆర్ ఎస్ పార్టీ మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

జాతీయ రహదారి మందగడ ఎక్స్ రోడ్డు వద్ద రాస్తారోకో చేపట్టి వాహనాలను నిలిపివేశారు. మరోవైపు బేలా మండలం కొబ్బాయి సిర్సన్న జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టగా మాజీ మంత్రి జోగురామన్న  పాల్గొని రైతులకు మద్దత్తుగా  నిరసన చేపట్టారు.

బేల మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. 

మాజీ మంత్రి జోగు రామన్న  మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.

 రైతులు పండించిన ప్రతి  గింజ కొలుగోలు నుండి,అమ్ముకునే వరకు  రైతులపై అనేక షరతులు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 

గత కెసిఆర్ ప్రభుత్వంలో రైతులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా నిబంధనలు లేకుండా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడమే కాకుండా రైతులను పూర్తిగా ఆదుకుందన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు  ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించడం తగదన్నారు.

 స్థానిక ఎంపీ ఎమ్మెల్యే  రైతులకు మద్దతుగా ఉండాల్సిపోయి  వారి స్వలాభాలకే ప్రాధాన్యం ఇవ్వడం  జరుగుతుందన్నారు, 

పంటల కొనుగోళ్లలో రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక ఎంపీ ఎమ్మెల్యే  అధికారులతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంలో విఫలమవుతున్నారన్నారు. రైతు కుటుంబాలను సైతం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
 రైతుల పండించిన ప్రతి గింజను కొనే వరకు బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన సంపూర్ణ మద్దతుని తెలుపుతూ రానున్న రోజుల్లో మరిన్ని నిరసన ఆందోళ కార్యక్రమాలు  చేపడుతూనే ఉంటామని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో బేల,జైనత్ బి ఆర్ ఎస్ మండల ముఖ్య నాయకులు, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments