ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోత....

Rathnakar Darshanala
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోత....
-పేరెంట్స్‌కు తప్పని భారాలు..*

నేటివార్త,సింగరేణి(జూన్ 19):(రాయల శ్రీనివాస్ స్టోరీ):

​ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు భారీగా పెరిగాయి.ఎల్కేజీ నుంచే వేలల్లో ఫీజులు వసూలు చేస్తుండటంతో సామాన్య,మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15% నుండి 20% వరకు ​భారీగా పెరిగిన ఫీజుల పెంచినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ట్యూషన్ ఫీజులతో పాటు అడ్మిషన్, డెవలప్‌మెంట్, బుక్స్, యూనిఫార్మ్స్,స్కూల్ బస్సుల పేరిట ఇష్టారాజ్యంగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.

విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి,ఫీజుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

"కరోనా తర్వాత ఆదాయాలు పెరగలేదు కానీ,పిల్లల చదువుల ఖర్చులు మాత్రం రెట్టింపయ్యాయి. ప్రభుత్వం ఫీజులను నియంత్రించాలి" అని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.

​ *యాజమాన్యాల వాదన:* 

ఉపాధ్యాయుల జీతాలు,స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం వల్లే స్వల్పంగా ఫీజులు పెంచాల్సి వచ్చిందని స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.
Comments