ADB :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు లకు శాపంగా మారాయి.
By
Rathnakar Darshanala
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు లకు శాపంగా మారాయి.
మాజీ మంత్రి జోగు రామన్న....
నేటి వార్త ఆదిలాబాద్ :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తు వారికి శాపంగా మారాయి అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ఆరోపించారు.
శనివారం స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతులను అనేక విధాలుగా మోసం చేస్తున్నాయని విమర్శించారు.
పంట కొనుగోళ్ల విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆందోళన చేపట్టిన తరువాతే జొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.
ఇది రైతులు, బీఆర్‌ఎస్ సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు.5తేదీ లోపు శనగ కొనుగోళ్లను కూడా ప్రారంభించాలని, లేనిపక్షంలో మరింత తీవ్ర ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి కలిగి ఉంటే వారు పండించిన పంటను వంద శాతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అన్నదాతలకు అండగా బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఎప్పుడో స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు లాభాలపై దృష్టి సారించడం కాకుండా రైతులకు రావలసిన లాభాలపై దృష్టి సారించాలని హెచ్చరించారు.
బి ఆర్ఎస్ పార్టీ చేసే పోరాటాలతో జిల్లా యంత్రాంగం దిగివచ్చి కొనుగోలు ప్రారంభిస్తాం అనగానే ఉటా హుటేనా ఎమ్మెల్యే పాయల శంకర్ వీడియో విడుదల చేయడం ఆశిస్పదంగా ఉందన్నారు..
అదేవిధంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నా ఫలితంగానే ప్రభుత్వం జొన్న కొనుగోళ్లపై ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు.
రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్నదాతల సంక్షేమంపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో రైతుల తరపున నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు.
ఈ ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్,బట్టు సతీష్,దాసరి రమేష్, ఆప్ కం గంగయ్య ,జంగిలి ప్రశాంత్, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.
Comments