బైక్ దొంగ అరెస్టు: మూడు వాహనాలు స్వాధీనం.

Rathnakar Darshanala
బైక్ దొంగ అరెస్టు: మూడు వాహనాలు స్వాధీనం.
 నేటి వార్త, సైబరాబాద్:

​సైబరాబాద్ కమిషనరేట్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు సారోలు వెంకటేష్‌ను  పోలీసులు మంగళవారం అరెస్టు చేసి, అతని వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

 నిందితుడు పగలు, రాత్రి సమయాల్లో ఇళ్ల ముందు, వైన్ షాపుల వద్ద పార్క్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడని జగద్గిరిగుట్ట డీఐ నరేంద్ర రెడ్డి వెల్లడించారు. 

గతంలోనూ మాదాపూర్, గచ్చిబౌలి, జీడిమెట్ల, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఇతనిపై పలు కేసులు నమోదైనట్లు గుర్తించామని, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. 

ఈ కేసును త్వరితగతిన ఛేదించిన డీఐ నరేంద్ర రెడ్డి మరియు క్రైమ్ బృందాన్ని కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి, ఏసీపీ బాలగంగి రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Comments