బెల్లంపల్లి ఆసుపత్రి అప్‌గ్రేడ్ ఎప్పుడూ..?

Rathnakar Darshanala
బెల్లంపల్లి ఆసుపత్రి అప్‌గ్రేడ్ ఎప్పుడూ..?
100 పడకల హామీ అమలు????
డాక్టర్ల కొరతతో ప్రజల ఆవేదన


బెల్లంపల్లి  స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

7 మండలాలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఈ ఆసుపత్రిలో సరిపడా సౌకర్యాలు, డాక్టర్లు లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

2022లో అప్పటి వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆసుపత్రిని 100 పడకలుగా విస్తరించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రకటన అమలు దిశగా ఎలాంటి పురోగతి కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

చిన్న చిన్న రోగాలకే రోగులను మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించాల్సి రావడం వల్ల సమయానికి చికిత్స అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

వైద్యుల కొరత ఆసుపత్రిలో ప్రధాన సమస్యగా మారింది. సరిపడా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది లేకపోవడంతో రోగులకు తగిన సేవలు అందడం లేదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడటంతో వారికి ఇది మరింత భారంగా మారింది.

ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు వెంటనే ఆసుపత్రిని 100 పడకలుగా అప్గ్రేడ్ చేసి, అవసరమైన వైద్యులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments