తాళం వేసిన ఇండ్లే టార్గెట్..

Rathnakar Darshanala
తాళం వేసిన ఇండ్లే టార్గెట్..
 -కారేపల్లి ఎస్సై బైరు గోపి.

నేటివార్త,సింగరేణి(ఏప్రిల్ 27):

 కారేపల్లిలో చోరీలతో హడలెత్తిస్తున్న దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తాళ్లం వేసిన ఇండ్లే టార్గెట్‌గా రాత్రి సమయంలో దొంగతానాలకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్, కారేపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 

దీనికి సంబంధించి కారేపల్లి ఎస్సై బైరు గోపీ తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం ఖిల్లా బజార్‌కు చెందిన ఎండీ.మతీన్ ఆరు కేసులలో ప్రధాన నిందితుడు. 

కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మతీన్ పై దొంతనం కేసులు, మధిర, బోనకల్, పెద్దపల్లి జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు. 

సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేసి నిందితుడిని సోమవారం కారేపల్లి ఆటో స్టాండ్ వద్ద గుర్తించి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మూడు తులాల బంగారం,20 తులాల వెండి అభరణాలు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.

I నిందితుడునికి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Comments