పాపం బావిలో పడి బాలుడు మృతి.
By
Rathnakar Darshanala
బావిలో పడి బాలుడు మృతి.
నేటివార్త,సింగరేణి(ఏప్రిల్ 27):
తన తల్లి వెంట మేకలు కాయటానికి వెళ్లి ప్రమాదావశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం పేరుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
గ్రామస్తులు,కుటుంబ సభ్యులు తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పేరుపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న బచ్చలకూరి వెంకన్న-మంజుల దంపతుల కుమారుడైన బచ్చలకూరి దీపక్ శ్రీనాధ్(11) 5వ తరగతి చదువుతున్నాడు.
వేసవి సెలవులు కావటంతో అమ్మ మంజులతో కలిసి మేకలు కాయటానికి గ్రామ సమీపంలోకి వెళ్ళాడు.మేకలు కాస్తుండగా మంచి నీరు అవుతున్నాయని తల్లితో చెప్పటంతో బావి దగ్గరకు వద్దు నీకు ఈత రాదని ఇంటికి వెళ్ళుమని తల్లి చెప్పింది.
బావి వద్ద దూరం నుండి నీళ్లు తాగుతానని చెప్పిన దీపక్ శ్రీనాధ్ బావి వద్దకు వచ్చి నీళ్లు త్రాగే క్రమంలో జారి బావిలో పడి పోయాడు.
నీళ్ల కోసం వెళ్లిన కొడుకు ఎంతకి రాక పోవటంతో బావి వద్దకు వచ్చిన తల్లికి కొడుకు శవమై కనిపించటంతో కేకలు వేసింది చుట్టు పక్కల వారు వచ్చి బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.
మృతుడి దీపక్ శ్రీనాధ్‌కు ఇద్దరు అక్కలు ఉన్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగా నొక్క కొడుకు బావి బలి తీసుకుందని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అక్కడి వారిని కలచి వేసింది.
Comments