జంగంగుంట్ల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి.
By
Rathnakar Darshanala
జంగంగుంట్ల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి.
నేటివార్త స్వర్ణ
ఎన్‌హెచ్-544డి రహదారిపై శివాలయం సమీపంలోని జంగంగుంట్ల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఐవీఆర్ ట్రావెల్స్ బస్సు (రిజిస్ట్రేషన్ నం. NL 07 B 0631) డ్రైవర్ అధిక వేగంతో నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న మోటార్‌సైకిల్ (నం. AP 39 HH 2578)ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన మల్లెల శ్రీనివాస రెడ్డి (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనతో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి గాయాలతో బయటపడ్డారు.
ప్రమాద సమయంలో మల్లెల శ్రీనివాస రెడ్డి కాకర్ల గ్రామం నుంచి కందులాపురం వైపు ప్రయాణిస్తుండగా, కాకర్ల రోడ్డులో నుంచి హైవేపైకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments