ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ.

Rathnakar Darshanala
ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ.
సోన్, నేటివార్త ప్రతినిధి: 

మండలంలోని కడ్తాల్ గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు గ్రామ సర్పంచ్ గుర్రం రాము ఆధ్వర్యంలో అరటిపండ్లు ,మజ్జిగ, ఓఆర్‌ఎస్ , ప్యాకెట్లను పంపిణీ చేశారు. 

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూలీలు ఎండదెబ్బకు గురికాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నందున ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందిస్తున్నామని తెలిపారు. 

కూలీలు తగినంత నీరు తాగుతూ, ఎండలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీఓ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సుమయ్య తస్కిన్ , వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments