లక్ష్మీపూర్ లో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Rathnakar Darshanala
లక్ష్మీపూర్ లో  ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.


నేటివార్త ఏప్రిల్ 27 గొల్లపల్లి : 

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని  లక్ష్మీపూర్ గ్రామంలో గల పార్టీ జెండా గద్దె వద్ద గ్రామ కమిటి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్  జెండా ఆవిష్కరణ చేసి భారత రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అనంతరం కార్యకర్తలు పార్టీ నినాదాలతో ప్రాంగణాన్ని మార్మోగించారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవిందుల లావణ్య-జలపతి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ భారత సమితి అన్నారు.

 ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని స్వరాష్ట్రాన్ని సాధించి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత భారత రాష్ట్రసతికి  కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. 

కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమ పోరాటాలను స్మరించుకున్నారు.

రాష్ట్ర సాధనలో పార్టీ చేసిన త్యాగాలు,సేవలను గుర్తుచేసుకుంటూ,గ్రామీణాభివృద్ధి,రైతుల సంక్షేమం,పేదల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు పార్టీ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.

ఈ  కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బలిజపెళ్లి గంగారెడ్డి,మాజీ సర్పంచ్  దావు సత్తయ్య, చింతపండు కళ్యాణ్, రంగ సత్యనారాయణ, గోవిందులజలపతి, 

బలిజపెళ్లి తిరుపతి, మ్యాట్నీ తిరుపతి, కొత్తూరి రాజేష్, ఆకుల కొమురెల్లి,రాజీ రెడ్డి ,పెద్దయ్య, మహిపాల్, శ్రీను,రాజకుమార్, రాజయ్య గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments