ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.

Rathnakar Darshanala
ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.
నేటివార్త రాయికల్ ఏప్రిల్ 27:

రాయికల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సేవలో బీఆర్ఎస్ పాత్రను స్మరించుకున్నారు.

ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, పట్టణ అధ్యక్షులు ఎలిగేటి అనిల్ కుమార్, మాజీ కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మారంపల్లి రాణి సాయి కుమార్,నాయకులు మహేష్ గౌడ్, కొయ్యడి మహిపాల్, 
లింగం గౌడ్, బత్తిని భూమయ్య, దివాకర్, సోహైల్, శ్రీరాముల సత్యనారాయణ,వినోద్, మహేష్,రాంచంద్రం,కట్ల నర్సయ్య, కోల రవి, సుతారి తిరుపతి, నీలి రమేష్, బొమ్మకంటి నవీన్, రాంరెడ్డి, సందేల విక్రమ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు.
Comments