ఫెర్టిలైజర్ డీలర్ల, రైతుల సమస్యలు పరిష్కారించాలి.

Rathnakar Darshanala
ఫెర్టిలైజర్ డీలర్ల, రైతుల సమస్యలు పరిష్కారించాలి...
ఒకరోజు బంద్ లో పాల్గొన్న ఫెర్టిలైజర్ డీలర్లు :


తాండూర్, నేటివార్త,ఏప్రిల్ 27 : దేశ వ్యాప్తంగా ఎరువుల షాపుల బంద్ లో భాగంగా ఉత్పత్తిదారుల విధానాలను నిరసిస్తూ తాండూర్ మండల వ్యాప్తంగా ఫెర్టిలైజర్ డీలర్లు సోమవారం బంద్ పాటించారు. 

తాండూర్ మండల కేంద్రంలోని తాండూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫర్టిలైజర్ సంఘం మండల అధ్యక్షుడు బోనగిరి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి  బాలు ప్రసాద్ మారు, 

కోశాధికారి దత్తుమూర్తి, తాండూర్ మండల ఫర్టిలైజర్  దుకాణాల యజమానులు  మాట్లాడుతూ  ఎరువుల కంపెనీల యాజమాన్యాల తీరుకు నిరసనగా ఆల్ ఇండియా ఫర్టిలైజర్స్ అసోసియేషన్, స్టేట్ ఫర్టిలైజర్స్ అసోసియేషన్, 

మంచిర్యాల జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆదేశాల మేరకు సోమవారం దేశ వ్యాప్తంగా నిర్వహించిన బంద్ లో భాగంగా డీలర్లు రైతుల సమస్యల పరిష్కారం కోసం తాండూర్ మండల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసినట్లు తెలిపారు.  

 ధరలు రోజు రోజుకూ భారమవు తున్నాయని, మరో వైపు కంపెనీలు వివిధ ఉత్పత్తులను లింక్ రూపంలో ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు భారం పడుతుందని, రవాణా చార్జీలు ఎక్కువగా ఉన్నందున ఆ భారం డీలర్లపైన పడి నష్టపోవాల్సి వస్తుందన్నారు.  

ఫర్టిలైజర్ లో ఎఫ్ఓఎల్ క్రింద మాకు (యూరియా, డిఏపి, కాంప్లెక్స్, ఫొటాస్) లింక్విడ్ ప్రోడక్ట్లు ఇవ్వకుండా ఎరువులు సరాపర చేయాలని, విత్తనాలు ఎరువుల శాంపిల్స్ ఫెయిల్ అయినట్లయితే కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైతులకు భారం కాకుండా కావాల్సిన ఎరువులను మాత్రమే ఇచ్చేలా చూడాలని, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

ఈ సమావేశంలో తాండూరు మండల ఫర్టిలైజర్ షాపుల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.
Comments