రహదారులపై ధాన్యం పోసిన వారికి నోటీసులు జారీ
By
Rathnakar Darshanala
రహదారులపై ధాన్యం పోసిన వారికి నోటీసులు జారీ
నేటి వార్తల ; రైతు సోదరులకు ముఖ్య ప్రకటన
రహదారులపై వరి ధాన్యం పోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
టార్పాలిన్ కవర్లు, బండరాళ్లు ఇష్టానుసారంగా ఉంచడం వలన వాహనదారులకు ప్రమాదం ఏర్పడుతోంది.
ముఖ్యంగా మన గ్రామస్తులు, రైతు సోదరులే ఈ ప్రమాదాలకు గురవుతూ ఆస్తి, ప్రాణ నష్టాలు చవిచూస్తున్నారు. పలువురు కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
సూచనలు:
వరి ధాన్యాన్ని కల్లాల వద్ద లేదా ఇంటి ప్రాంగణంలోనే ఆరబెట్టుకోవాలి.
రహదారులపై ధాన్యం పోయకూడదు.
అవసరమైతే గ్రామ పంచాయతీ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే ఆరబెట్టాలి.
రాత్రి సమయంలో ఎలాంటి అడ్డంకులు రహదారిపై ఉంచకూడదు.
చర్యలు:
రహదారులపై ధాన్యం పోసిన వారికి నోటీసులు జారీ చేయబడతాయి.
చట్టపరమైన చర్యలు తప్పవు.
ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయబడతాయి.
రైతు సోదరులు పోలీసు శాఖ విజ్ఞప్తిని గౌరవించి, రహదారులపై ధాన్యం పోయకుండా సహకరించగలరు అని ఆశిస్తున్నాం.
ఇట్లు,
వి. మాధవి, ACP
హుజురాబాద్
Comments