ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు వినతి.

Rathnakar Darshanala
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు వినతి.
నేటి వార్త మంచిర్యాల జిల్లా :

గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బి ఆర్ ఎస్వి నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్,బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, బి ఆర్ ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. 

విద్యార్థులు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్నారని, చదువును కొనసాగించడంలో అవరోధాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్  తదితరులు పాల్గొన్నారు.
Comments