బ్రహ్మం గారి మఠంలో భక్తులకు చల్లని ఊరట: మజ్జిగ, మంచినీళ్ల పంపిణీ
By
Rathnakar Darshanala
బ్రహ్మం గారి మఠంలో భక్తులకు చల్లని ఊరట: మజ్జిగ, మంచినీళ్ల పంపిణీ
కడప (బ్రహ్మంగారిమఠం)
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి **333వ ఆరాధన మహోత్సవాలు** మఠంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఉపశమనం కలిగించేలా మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే **పుట్టా సుధాకర్ యాదవ్** ఆదేశాల మేరకు ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
టీడీపీ మండల అధ్యక్షులు **చెన్నుపల్లి సుబ్బారెడ్డి* సూచనలతో, కడప జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు *కానాల మల్లికార్జున రెడ్డి* ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ మరియు మంచినీళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
3,000* మజ్జిగ ప్యాకెట్లు
*10,000* మంచినీళ్ల ప్యాకెట్లు
ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు
ఎంపీపీ వీరనారాయణరెడ్డి, యల్లటూరి సాంబశివారెడ్డి, యస్.ఆర్ శ్రీనివాసులరెడ్డి, ముడమాల పోలిరెడ్డి, పూజ శివాయాదవ్, సుధాకర్, నాగయ్య, రామసుబ్బారెడ్డి,
శీలం నరసింహ గౌడ్ సూరి యాదవ్ మరియు
*వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు* మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
స్వామివారి ఆరాధన మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ చలివేంద్రం తరహా పంపిణీని చేపట్టామని. కడప జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు
కానాల మల్లికార్జునరెడ్డి తెలిపారు
Comments