కేబుల్ బ్రిడ్జి ప్రమాద నిందితుడు అరెస్టు.

Rathnakar Darshanala
కేబుల్ బ్రిడ్జి ప్రమాద నిందితుడు అరెస్టు.
నేటి వార్త, సైబరాబాద్:

కేబుల్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహమ్మద్ అబ్దుల్ నవీద్‌(44)ను సైబరాబాద్ కమీషనరేట్ లోని మాదాపూర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

సీఐ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం టోలిచౌకి ఎస్.ఏ. కాలనీలో నివసించే నిందితుడు ఐటీ రంగంలో డేటా సెంటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా, 

ఈ నెల 19న బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో శ్యామ్ రాజ్ గోస మృతి చెందాడు.

 ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలను చూసి భయాందోళనకు గురైన నవీద్, అదే రోజు ఉదయం తన కుటుంబంతో కలిసి మరో వాహనంలో జహంగీర్ దర్గాకు, అక్కడి నుంచి మైసూర్, ఊటీలకు పారిపోయాడు. 

నిందితుడి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టిన మాదాపూర్ పోలీసులు, ప్రత్యేక బృందాన్ని ఊటీకి పంపి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. 
ఆదివారం నిందితుడిని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అధికారికంగా అరెస్టు నమోదు చేశారు.
Comments