గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన.

Rathnakar Darshanala
గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన.
నేటివార్త స్వర్ణ మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఏప్రిల్ 27

గిద్దలూరు: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, ఆర్చనలు నిర్వహించి, అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమం భక్తిమయ వాతావరణంలో సాగింది.
ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు  షరాబు దత్తాచారి, దొడ్డజు రంగాచారి, కోడూరు చంద్రశేఖరాచారి, ముత్తోజు ఆంజనేయాచారి, నరసింహాచారి, సాయి చేతన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో స్వామివారి భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు.
Comments