లారీ డ్రైవర్ కు జరిమానా విధించిన ఎస్సై నాగరాజు.

Rathnakar Darshanala
లారీ డ్రైవర్ కు జరిమానా విధించిన ఎస్సై నాగరాజు.
నేటివార్త, స్వర్ణ మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఏప్రిల్ 24

కొమరోలు ఎస్‌ఐ జె నాగరాజు నిన్న రాత్రి నిర్వహించిన సాధారణ తనిఖీలలో భాగంగా ఒక లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

 అనంతరం నిందితుడిని శుక్రవారం గిద్దలూరు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చెనికల రమేష్ యాదవ్  ఎదుట హాజరుపరిచారు.

విచారణ జరిపిన మెజిస్ట్రేట్, నిందితుడిపై ఆరోపణలు నిర్ధారణ కావడంతో రూ.10,000 జరిమానాతో పాటు 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
Comments