సీఎస్‌సీ హెల్త్ కేర్‌లో ఉద్యోగ అవకాశాలు.

Rathnakar Darshanala
సీఎస్‌సీ హెల్త్ కేర్‌లో ఉద్యోగ అవకాశాలు. 
తాండూర్, నేటివార్త, ఏప్రిల్ 24:

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు కామాన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) హెల్త్ కేర్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు టాస్ అధికారి రవితేజ ఒక ప్రకటనలో తెలిపారు. 

జిల్లాలోని సీఎస్‌సీ హెల్త్ కేర్‌లో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం, జీఎన్ఎం, ల్యాప్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఏఎన్ఎం లేదా జీఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న 
నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ఆసక్తి గల అభ్యర్థులు 8332006055, 7799669961, 6302355003 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు
Comments