కన్నుల పండుగగా స్టాండర్డ్ స్కూల్ 20వ వార్షికోత్సవ వేడుకలు

Rathnakar Darshanala
కన్నుల పండుగగా స్టాండర్డ్ స్కూల్ 20వ వార్షికోత్సవ వేడుకలు 
*అక్షరాల పూధోటలో పట్టాలు అందుకున్న పసి మొగ్గలు*

నేటివార్త జగిత్యాల బ్యూరో, ఏప్రిల్ 24:

జగిత్యాల పట్టణ కేంద్రంలోని స్టాండర్డ్ క్రియేటివ్ స్కూల్ 20వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. 

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ గొడికె గంగాధర్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి దేశ పౌరులని, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో స్టాండర్డ్ స్కూల్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. 

విద్య అనేది కేవలం మార్కులకే పరిమితం కాకుండా, సమాజం పట్ల బాధ్యత, నైతిక విలువలను పెంపొందించే సాధనంగా ఉండాలని పేర్కొన్నారు.

.ఈ క్రమంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు మరియు బహుమతులు అందజేశారు. 

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి విజయాలు తల్లిదండ్రులకు, పాఠశాలకు గర్వకారణమని తెలిపారు.

తరువాత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో న్యాయవాది శ్యామ్ శశిధర్, సూర్యనారాయణ ప్రసాద్, మహమ్మద్ గౌరి, హెడ్‌మాస్టర్ సరళ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Comments