మహిళా వ్యతిరేక పార్టీ కాంగ్రెస్-మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు.

Rathnakar Darshanala
మహిళా వ్యతిరేక పార్టీ కాంగ్రెస్-మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు.
 
 .  బీజేపీ మండలాధ్యక్షులు పంజాల ప్రశాంత్

నేటివార్త  ఏప్రిల్ 18

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని వ్యతిరేకిస్తూ శనివారం రోజున గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల అధ్యక్షులు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించరు.

ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు  పంజాల ప్రశాంత్  మాట్లాడుతూ మహిళల హక్కులు మరియు సాధికారతకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మహిళల అభివృద్ధి మరియు సాధికారతపై నమ్మకద్రోహం చేసిందని అన్నారు.

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన ఈ కీలక బిల్లును వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క మహిళా వ్యతిరేక వైఖరి బహిర్గతమైందని తెలిపారు. 

రాబోయే రోజుల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుల కోల అశోక్,
బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవల్లి శశిధర్ రెడ్డి,జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి మల్యాల వినయ్ సాగర్,కిసాన్ మోర్చా నాయకులు సుద్దాల రవీందర్ రెడ్డి, పెంచాల రాములు, 

ఆకుల మనోహర్ మండల ఉపాధ్యక్షులు గంకిడి చంద్రారెడ్డి,బొమ్మ కంటి రాజిరెడ్డి,మండల ప్రధాన కార్యదర్శిలు రేండ్ల శ్రీనివాస్, తాళ్ల రాజశేఖర్, 
మండల నాయకులు
గాలిపెల్లి శ్రీనివాస్, పృధ్విధర్ గౌడ్,జోగు అజయ్, హర్ష రాజు, వెంకట్ రెడ్డి, రావుల సత్యనారాయణ, సర్వ వినోద్, బత్తిని శ్రీధర్ గౌడ్, 

బీజేవైఎం మండల అధ్యక్షులు దయ్యాల ప్రణయ్,వోడ్నాల రాజు, గరిగంటి సుమన్, తుమ్ కరుణాకర్,చిందం ఆంజనేయులు,బండ అనిల్, దుబ్బాసి బాలు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments