భారీ కొండచిలువ పట్టివేత.
By
Rathnakar Darshanala
భారీ కొండచిలువ పట్టివేత.
*--భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు, చాకచక్యంగా పట్టుకున్న సాగర్ స్నేక్ సొసైటీ సభ్యులు*
*--కొండచిలువ పొడువు 7 పిట్లు ,బరువు 15 కేజీలు*
*--ఎవరికైనా పాములు, వన్యప్రాణులు కనబడినతే 99855 45526 నెంబర్ కి సమాచారం ఇవ్వండి*
*--సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు చీర్ల కృష్ణసాగర్*
*నేటివార్త జులై 21(పెబ్బేర్ వనపర్తి జిల్లా ప్రతినిధి విభూది కుమార్)*
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు చెలిమిల్లకి చెందిన పెళ్లూరి కృష్ణయ్య రాత్రి భోజనం చేసి 10 గంటల సమయంలో వరండాలో పడుకోన్నాడు. తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో కుక్కలు అరుస్తున్న శబ్దానివిని లేచి పడుకున్న పరుపులో ఏదో కదులుతున్నట్లు గ్రహించి చూడగా పరుపులో పక్కనే కొండచిలువను చూసి వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న సాగర్ స్నేక్స్ సొసైటీ అధ్యక్షులు చీర్ల, కృష్ణసాగర్ కి సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే స్నేక్స్ సొసైటీ బృందం చెలిమిళ్ళ గ్రామం కృష్ణయ్య ఇంటికి చేరుకొని ఇంటి మెట్ల కింద దాగి ఉన్న కొండచిలువను సురక్షితంగా బంధించిన కొండచిలువను ఫారెస్ట్ అధికారుల సమక్షంలో సురక్షితమైన అడవి ప్రాంతంలో వేడిలివేస్తాం అన్ని తెలిపారు. ఈ సందర్బంగా కృష్ణసాగర్ మాట్లాడుతూ గ్రామస్తులకు ఎవరికైనా ఏ పాములు, వన్యప్రాణులు కనబడినతే వెంటనే సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్, సాగర్ స్నేక్స్ సొసైటీ సభ్యులు చిలుక కుమార్ సాగర్, అవినాష్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Comments