Karimnagar :అరైవ్–అలైవ్ సదస్సుతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించన DGP.
By
Rathnakar Darshanala
అరైవ్–అలైవ్ సదస్సుతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించన DGP.
- కరీంనగర్‌లో ప్రజా పాలన కార్యక్రమం
- డీజీపీ శివధర్ రెడ్డి కీలక సూచనలు
- డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి
నేటి వార్త కరీంనగర్, ఏప్రిల్ 18 : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్‌లో నిర్వహించిన “అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ వాహనదారులు ఎల్లప్పుడూ డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించాలని సూచించారు. రోడ్డు పరిస్థితులు, ఇతర వాహనాల కదలికలను ముందుగానే అంచనా వేసుకుని జాగ్రత్తగా ప్రయాణించాలని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి అలవాట్లు ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సురక్షిత ప్రయాణం కోసం అందరూ కలిసి పనిచేయాలని డీజీపీ అధికారులకు ప్రజలకు సూచించారు.
Comments