పోలీసు విధులను ఆటంకపరచిన ముగ్గురు అరెస్ట్, రిమాండ్.
By
Rathnakar Darshanala
పోలీసు విధులను ఆటంకపరచిన ముగ్గురు అరెస్ట్, రిమాండ్.
*ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ పట్టుబడి, పోలీసులకు తిరగబడ్డ నిందితులు*
*వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు*
*వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్*
నేటి వార్త ఆదిలాబాద్ :
నిందితుల వివరాలు*
A1) కట్కంవార్ ప్రశాంత్ @ రాజేందర్ (29) s/o రమేష్, నివాసం: కుమ్మరికుంట, ఆదిలాబాద్
A2) అంగల్వార్ భారత్ సింగ్ (30) s/o సంతోష్, నివాసం: కొత్త కుమ్మరికుంట, ఆదిలాబాద్
A3) వేదవ్యాస్ @ డీకొండ వేదవ్యాస్ (22) s/o ప్రభాకర్,నివాసం: శ్రీరామ్ కాలనీ, ఆదిలాబాద్
*వివరాలలో*
గత నెల 19వ తారీఖున రాత్రి 8 గంటల సమయంలో స్థానిక ఏరోడ్రం పరిసర ప్రాంతాలలో బహిరంగ మద్యం సేవిస్తున్న ముగ్గురు నిందితులు, విధులలో ఉన్న పెట్రో కార్ సిబ్బందికి పట్టుబడగా వారి వివరాలు సేకరిస్తున్న సమయంలో పోలీసులకు తిరగబడి,
వారితో వాగ్వాదానికి దిగిన కారణంగా ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ తెలిపారు. వారిపై క్రైమ్ నెంబర్ 214/26 తో అండర్ సెక్షన్ 132, 292, 296(బి) r/w 3 (5) బిఎన్ఎస్ తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
నిందితులను శనివారం పట్టుకొని గౌరవ న్యాయమూర్తి ముందు హాజరు పరచగా రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. విధులలో ఉన్న పోలీసులతో మర్యాదగా ప్రవర్తించాలని, తప్పుచేసి దబాయించే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ చేయడం చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.
Comments