28న ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల ఎంపిక.

Rathnakar Darshanala
28న ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల ఎంపిక.
తాండూర్, నేటివార్త, ఏప్రిల్ 26:

తాండూర్ మండలంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ లబ్ధిదారుల ఎంపిక కొరకు ఈనెల 28వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బ్యాంకు మేనేజర్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

2025-2026 సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించిన అభ్యర్థులు హాజరుకావాలని కోరారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.
Comments