ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం.

Rathnakar Darshanala
ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం.
నేటి వార్త, శేరిలింగంపల్లి:

శిల్పారామంలో ఆదివారం అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

 రవి బృందం కూచిపూడి, వైదేహి సుభాష్ బృందం భరతనాట్యం, సుచరిత ఘోష్ మణిపురి, సాయి-సంతోష్ బృందం పేరిణి, అర్చన మిశ్ర బృందం కథక్, గర్భ, సస్మితా మిశ్ర బృందం ఒడిసి, 

సంబల్పూరి, సాత్విక బృందం ఆంధ్రనాట్యం, సుచిస్మితా స్వైన్ బృందం కాశ్మీరీ, అస్మిత కాలే బృందం లావని, సంజుక్త ఘోష్ బృందం రవీంద్ర నృత్యాలను ప్రదర్శించారు. 

సుమారు 80 మంది కళాకారులు, గురువులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లేలా ఏటా శిల్పారామంలో అన్ని కళారూపాలను ప్రదర్శింపజేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నామని, 

అందరికీ అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలని శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావు తెలిపారు.
Comments