జగిత్యాల జిల్లాకు కొత్త అదనపు ఎస్పీ బాధ్యతలు స్వీకరణ.
By
Rathnakar Darshanala
జగిత్యాల జిల్లాకు కొత్త అదనపు ఎస్పీ బాధ్యతలు స్వీకరణ.
నేటివార్త జగిత్యాల బ్యూరో, ఏప్రిల్ 23:
జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా చేతన్ నితిన్ గురువారం రోజున అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.
చేతన్ నితిన్ 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో జనగామలో ఏఎస్పీగా విధులు నిర్వర్తించి, తన సేవల ద్వారా మంచి గుర్తింపు పొందారు.
జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడంలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Comments