జువారి సిమెంట్ కర్మాగారం వద్ద ఆందోళన.

Rathnakar Darshanala
జువారి సిమెంట్ కర్మాగారం వద్ద ఆందోళన.
( నేటివార్త ) కడప జిల్లా ఎర్రగుంట్ల  కర్మాగారం గేటు ముందు బైటాయించిన వలసపల్లె గ్రామ ప్రజలు
వలసపల్లి గ్రామంలోని సమాధులను కూల్చారంటు ఆందోళన చేపట్టిన గ్రామస్థులు
జువారి యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు...

గ్రామస్థులకు తెలియజేయకుండా సమాధులు తొలగించడం ఏంటంటూ జడ్పీటీసీ బాలయ్య యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు
సుమారు 1200 ఎకరాల భూమిని కర్మాగార నిర్మాణం కోసం వలసపల్లి గ్రామస్థులు త్యాగం చేశారని గుర్తుచేశారు.

70 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ప్రభుత్వాలు చెబుతున్నా...లేబర్ పనులకు మాత్రమే గ్రామస్థులను తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు
గ్రామానికి కూతవేటు దూరంలో పరిశ్రమ ఉన్నప్పటికీ ఉపాధికోసం వలసపల్లి గ్రామస్థులు వలస వెళ్ళవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు,

పరిశ్రమలో నిర్వహించే భారీ పేలుళ్ల కారణంగా గ్రామంలోని చాలా గృహాలు నెర్రెలు చీలి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయన్నారు.

కలెక్టర్, ఉన్నతాధికారులు, నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికి ప్రయోజనం లేదని,యాజమాన్యం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తోందని ఆరోపించారు.

కర్మాగారం కారణంగా తాగునీరు కలుషితం అయ్యాయని, ఆ కారణంగా 10 మందికి పైగా క్యాన్సర్ తో మరణించారని, మరో 10 మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారని వాపోయారు

వలసపల్లి దత్తత గ్రామం అయినప్పటికీ యాజమాన్యం దృష్టిలో మొదటినుండి గ్రామాన్ని చిన్నచూపుగానే చూస్తున్నారని అన్నారు.

కర్మాగారం నుండి విలువడే డస్ట్ కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, రైతులను ఎవరు ఆదుకోవాలని ప్రశ్నించారు.

పూర్వీకులకు గుర్తుగా..పవిత్రంగా భావించే సమాధులను కూల్చడం బాధాకరమని, దీనికి యాజమాన్యం సమాధానం చెప్పాలంటూ గేటు ముందు బైటాయించినట్లు జడ్పీటీసీ బాలయ్య పేర్కొన్నారు.
స్మశాన వాటికలోని సమాధులను గ్రామస్థులకు తెలియకుండా జువారి యాజమాన్యం కూల్చారని గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి, కూటమి నాయకులు సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.

గతంలో పేలుళ్ల దాటికి ఇళ్లు కూలి మహిళ చనిపోతే యాజమాన్యం పట్టించుకోలేదని,డస్ట్ కారణంగా పంటలు పండక రైతులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోరని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమన్నా పట్టించుకోరని యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 బ్లాస్టింగ్ ఆపుతామని కర్మాగార జనరల్ మేనేజర్  హామీ ఇచ్చినప్పటికీ , రాతపూర్వకంగా ఇవ్వాలంటూ  గ్రామస్తులు డిమాండ్ చేశారు.

గ్రామం వైపు బ్లాస్టింగ్ చేయమని, 10 రోజుల్లోగా ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని జి ఎం హామీ మేరకు గ్రామస్థులు ఆందోళనను విరమించారు.

గ్రామంలోని సమస్యలపై జి ఎం కు గ్రామస్తులు వినతిపత్రం అందించారు...
 బ్లాస్టింగ్ ఆపాలి... లేదా గ్రామాన్ని తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు

 గ్రామస్తులంతా ఏకమయ్యామని, గ్రామానికి న్యాయం జరగకపోతే రాబోవు రోజుల్లో పరిశ్రమలో విధులు జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు...
Comments