కేబుల్ బ్రిడ్జిపై బైకులో మంటలు.​

Rathnakar Darshanala
కేబుల్ బ్రిడ్జిపై బైకులో మంటలు.
 నేటి వార్త,సైబరాబాద్:

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్‌కు చెందిన  జితిన్ తన పల్సర్ ఎన్ఎస్ 200 వాహనంపై బ్రిడ్జిపై ప్రయాణిస్తుండగా,  

ఒక్కసారిగా బైకులో మంటలు చెలరేగాయి. గమనించిన బాధితుడు వెంటనే అప్రమత్తమై వాహనాన్ని పక్కన నిలిపి కిందకు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Comments