సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు.
By
Rathnakar Darshanala
సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు.
నేటివార్త రాయికల్,ఫిబ్రవరి 3 :
భీమన్న జాతర సందర్భంగా రాయికల్ లో సంఘమిత్ర (శివాజీ రెడ్డి) యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో సంఘమిత్ర (శివాజీ రెడ్డి) యూత్ జట్టు ప్రథమ స్థానాన్ని సాధించి రూ.5016 నగదు బహుమతిని గెలుచుకుంది.
రెండో స్థానంలో టి.ఆర్.బి యూత్ జట్టు నిలిచి రూ.3016 నగదు బహుమతిని పొందింది.
యువత క్రీడల్లో ముందుకు రావాలని, ఇలాంటి పోటీలు శారీరక దృఢత్వంతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.
కబడ్డీ పోటీలను పీఈటీలు బందెల శ్రీనివాస్,ఆకు రాజేందర్,తాటిపాముల శ్యామ్ సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యూత్ అధ్యక్షుడు జిల్లాల సుధాకర్, సంఘమిత్ర రైతు సంఘం అధ్యక్షుడు కుంబాల శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు తురుగ శ్రీధర్ రెడ్డి,
పాలడుగు అనిల్, పాలడుగు విజయ్, విక్కీ, గంగారెడ్డి, సంతోష్, సురేష్, నాగరాజు, సుధర్శన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments