సత్తెనపల్లి పట్టణాభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు.
By
Rathnakar Darshanala
సత్తెనపల్లి పట్టణాభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు.
నేటి వార్త, సత్తెనపల్లి..
పురపాలక శాఖ మంత్రి నారాయణకి కృతజ్ఞతలు తెలిపిన శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ.
సత్తెనపల్లి పట్టణ అభివృద్ధికి ఐదు కోట్ల నిధులను పురపాలక శాఖ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల సత్తెనపల్లి పట్టణంలో మంత్రి నారాయణ పర్యటన సందర్భంగా అభివృద్ధి పనులకు ఐదు కోట్లు, పురపాలక సంఘ నూతన కార్యాలయం భవన నిర్మాణానికి మరో రెండు కోట్లు విడుదల చేయాలని ఇటీవల కన్నా కోరారు.
.మంత్రి నారాయణ స్పందించి అభివృద్ధి పనులకు ఐదు కోట్ల నిధులు మంజూరు చేశారు.మంత్రి నారాయణ కి, కూటమి ప్రభుత్వానికి శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
Comments