వేసవిలో తాగునీటి కొరత లేకుండా చూడాలి.
By
Rathnakar Darshanala
వేసవిలో తాగునీటి కొరత లేకుండా చూడాలి.
నేటి వార్త,రామడుగు.
వేసవికాలంలో తాగునీటికి ఇబ్బంది ఏర్పడకుండా చూడాలని ఇంచార్జ్ ఎంపీడీవో శ్రవణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని షానగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు.
గ్రామంలోని చేతి పంపులు, కరెంటు మోటార్లు మంచినీటి బావులు వాటి వివరాలను వేసవికాలంలో వాటిలో నీటి లభ్యత వివరాలు .
మిషన్ భగీరథవాటర్ నుంచి నీటి సరఫరా వివరాలు అధికారులతో గ్రామపంచాయతీ పాలకవర్గం సిబ్బంది సహకారంతో వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు.
గ్రామంలోని మంచినీటి బావులను చేతిపంపులను వాటర్ ట్యాంకులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గునుకొండ శైలజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ గ్రిడ్ డి ఈ సందీప్, ఏయి అజీమ్ ఉద్దీన్, ఆర్డబ్ల్యూఎస్ ప్రకాష్ ఉప సర్పంచ్ చిరుత అంజయ్య
మాజీ సర్పంచ్ గునుకొండ అశోక్ పంచాయతీ కార్యదర్శి మధుసూదన్ వార్డు సభ్యులు పర్లపల్లి నరేష్ సైoన్ల స్వప్న తిరుపతి గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments