కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:

Rathnakar Darshanala
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:
 ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి :

జమ్మికుంట పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. 

రైతుబంధు, వృద్ధులకు ₹4000 పెన్షన్, మహిళలకు ₹2500 ఆర్థిక సాయం, వడ్లకు ₹500 బోనస్, తులం బంగారం, బతుకమ్మ చీరలు వంటి హామీలలో ఒక్కటీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు.

రైతులకు అవసరమైన యూరియా బస్తాల సరఫరాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. 

ఎన్నికల సమయం దగ్గరపడగానే ప్రజల ముందుకు వచ్చి మాయమాటలతో ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు అప్రమత్తంగా ఉండి, హామీల అమలుపై గట్టిగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుబంధు బకాయిలు, సన్నబియ్యానికి బోనస్ బకాయిలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం, నిరుద్యోగ భృతి గల్లంతు, విద్యా భరోసా కార్డ్ అమలు కాకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ రెండేళ్లుగా చెల్లించకపోవడం వంటి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

అలాగే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ, ఆటో కార్మికులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయలేదన్నారు.

జమ్మికుంట పట్టణంలోని 6, 7, 8, 21,5,15, 26, 27, 28, వార్డుల్లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న ఆయన, తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే, హుజురాబాద్ నియోజకవర్గ గౌరవం నిలబెట్టాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమం లో వరంగల్ మాజీ zp చేర్మెన్ మారపల్లి సుదీర్ కుమార్ గారు మాజీ మున్సిపల్ చెర్మన్ రాజేశ్వర్ రావు గారు మరియు వార్డు ప్రజలు BRS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Comments